ఏపీలో చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలు... 'జగనన్న తోడు' పథకానికి అర్హతల వివరాలు!
- 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి
- గ్రామాల్లో అయితే నెలవారీ రూ. 10 వేల లోపు ఆదాయం ఉండాలి
- 5 చ.అడుగుల లోపు స్థలంలో వ్యాపారాలు చేస్తుండాలి
రాష్ట్రంలోని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం 'జగనన్న తోడు' పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించేందుకు కార్యాచరణ కూడా మొదలైంది. ఈనెల 16న దీనికి సంబంధించిన సర్వే ముగియనుంది. ఈనెల 23లోగా అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.
ఈ పథకం ద్వారా తోపుడు బండ్లు, సైకిల్, వాహనాలపై వస్తువులను అమ్మేవారు, ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేసుకునేవారు, కొయ్యబొమ్మలు, హస్తకళలపై ఆధారపడేవారికి వడ్డీలేని రుణాలు లభించనున్నాయి. ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ. 10 వేల చొప్పున లోన్లు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు ఇవే:

- దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి.
- నెలవారీ ఆదాయం పట్టణాల్లో అయితే రూ. 12 వేల లోపు, గ్రామాల్లో అయితే రూ. 10 వేల లోపు ఉండాలి.
- మాగాణి 3 ఎకరాల లోపు, మెట్టభూములు 10 ఎకరాలు... మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
- 5 చదరపు అడుగుల స్థలం లేదా అంతకన్నా తక్కువ స్థలంలో వ్యాపారాలు చేస్తుండాలి.