శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ తరలింపా? దారిపొడవునా రక్తస్రావం: దేవినేని ఉమ

  • అచ్చెన్న అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన
  • రాజకీయ కక్షసాధింపు కోసం రాజారెడ్డి రాజ్యాంగం అమలు
  • ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది జగన్‌ గారు
  • వ్యవసాయ బడ్జెట్‌లో ఖర్చు చేసింది మూడోవంతు మాత్రమే
తమ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘన జరిగింది. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ వాహనంలో తరలింపా? దారిపొడవునా రక్తస్రావం. రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తారా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది జగన్‌ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

అలాగే, మరో ట్వీట్ లో 'వ్యవసాయ బడ్జెట్‌లో ఖర్చు చేసింది మూడోవంతు మాత్రమే. మాఫీ బకాయిలు 7 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. రైతులను కులాల పేరుతో విభజించి 13 లక్షల మంది కౌలు రైతులను ముంచారు. ధరల స్థిరీకరణ నిధులెక్కడ ఖర్చుపెట్టారు? ఎంతమంది రైతులకు సున్నావడ్డీ, బీమా పరిహారం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయగలరా వైఎస్ జగన్ గారు?' అని ఆయన ప్రశ్నించారు.


More Telugu News