విజయ్ మాల్యాకు దారులు మూసుకుపోయాయి: ఇంగ్లండ్ హైకోర్టుకు తెలిపిన భారతీయ బ్యాంకులు
- భారత్‌లో న్యాయం జరగదన్న మాల్యా వాదనను పట్టించుకోవద్దు
- అతడిపై ఇప్పటికే దివాలా ఆర్డర్ జారీ చేశాం
- లండన్ హైకోర్టు దివాలా విభాగంలో వాదనలు వినిపించిన భారత బ్యాంకులు
భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా సెటిల్‌మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ విషయంలో అతడికి ఉన్న దారులు మూసుకుపోయాయని భారత బ్యాంకులు ఇంగ్లండ్ హైకోర్టుకు తెలిపాయి. తాము ఇప్పటికే అతడిపై దివాలా ఆర్డర్ జారీ చేశామని, కాబట్టి చెల్లింపులకు సంబంధించిన సెటిల్‌మెంట్ కోసం అతడు ముందుకొచ్చినా ఇప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశాయి.
లండన్ హైకోర్టుకు చెందిన దివాలా విభాగంలో మాల్యాపై కేసుపై జరిగిన విచారణలో ఎస్‌బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకులు తమ వాదన వినిపించాయి. రాజకీయ కారణాల మూలంగా భారత్‌లో తనకు న్యాయం జరగదన్న మాల్యా వాదనను పట్టించుకోవద్దని ఈ సందర్భంగా కోరాయి. మాల్యా చెప్పినట్టు తాము సెక్యూర్డ్ క్రెడిటర్లు కాదన్న బ్యాంకులు.. రెండో సెటిల్‌మెంట్ ఆఫర్ కింద మాల్యా చూపిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నాయి. కాబట్టి మాల్యా సెటిల్‌మెంట్ ఆఫర్‌కు విలువ లేదని కోర్టుకు వివరించాయి.