తెలంగాణలో 30 వేలకు చేరువలో కేసులు.. నిన్న ఒక్క రోజే 1,924 కేసులు వెలుగులోకి
- రాష్ట్రవ్యాప్తంగా 29,536 కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 కేసుల నమోదు
- రాష్ట్రంలో ఇంకా 11,933 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు 30 వేల సమీపానికి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 1,924 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 29,536కు పెరిగింది. నిన్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 324కు పెరిగింది. తాజాగా, 992 మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17,279కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 11,933 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
నిన్న నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,590 ఉండగా, ఆ తర్వాత అత్యధికంగా నమోదైన జిల్లాల్లో రంగారెడ్డి (99), మేడ్చల్ (43), వరంగల్ రూరల్ (26), సంగారెడ్డి (20), నిజామాబాద్ (19), మహబూబ్‌నగర్ (15), కరీంనగర్ (14) ఉన్నాయి.
.