ఏపీ సీఎం కార్యాలయంలో కీల‌క‌ మార్పులు!

  • ఇప్పటి వరకు సీఎంఓలో చక్రం తిప్పిన అజేయ కల్లాం
  • ప్రవీణ్ ప్రకాశ్, సాల్మన్, ధనుంజయ్ రెడ్డిలకు కీలక బాధ్యతలు
  • చర్చనీయాంశంగా మారిన అధికారుల మార్పు
ఏపీ సీఎం కార్యాలయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు సీఎంవోలో కీలక బాధ్యతలను నిర్వహించిన అజేయ కల్లాం, పీవీ రమేశ్, జే.మురళిని తప్పించారు. వీరి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాశ్, సాల్మన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. ప్రవీణ్ ప్రకాశ్ కు జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయశాఖ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డు బాధ్యతలను ఇచ్చారు.

సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో ఆర్ అండ్ బీ, రవాణ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, సంక్షేమం, పీఆర్, ఆర్టీసీ, పెట్టుబడులు, కార్మికశాఖ, గనులు, ఐటీ ఉన్నాయి. ధనుంజయ్ రెడ్డికి మున్సిపల్, అటవీ, వైద్యారోగ్యం, జలవనరులు, టూరిజం, మార్కెటింగ్, ఇంధనం శాఖలను అప్పజెప్పారు. ఇప్పటి వరకు సీఎంవోలో చక్రం తిప్పిన అధికారులను పక్కనపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


More Telugu News