మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో విజయ్ దేవరకొండ!

  • 'ఆచార్య' తర్వాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ 
  • కీలకమైన మరో యంగ్ హీరో పాత్ర
  • మొదట్లో అల్లు అర్జున్ నటిస్తాడంటూ వార్తలు
  • తాజాగా విజయ్ దేవరకొండతో సంప్రదింపులు
మెగాస్టార్ నటించే చిత్రంలో నేటి యంగ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న చిరంజీవి దీని తర్వాత మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రంలో నటించనున్నారు. 'సాహో' ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇక ఇందులో ఓ యంగ్ హీరో చేయాల్సిన పాత్ర కూడా వుంది. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రలో మొదట్లో అల్లు అర్జున్ నటిస్తాడంటూ ప్రచారం జరిగింది. అయితే, అందులో వాస్తవం లేదని తేలిపోవడంతో, ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్ర కోసం విజయ్ ని అడిగారనీ, ఆయన ఇంకా ఏ విషయం చెప్పలేదనీ తెలుస్తోంది. ఈ సినిమా షూటింగుకి బహుశా తక్కువ రోజులే అవసరం అవుతాయి కాబట్టి విజయ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అంటున్నారు.


More Telugu News