వచ్చే ఏడాది మార్చికి ఇండియాలో రోజుకు 2.8 లక్షల కరోనా కేసులు: వెల్లడించిన తాజా అధ్యయనం
- కరోనా కేసులపై మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం
- 2021 మార్చికి ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల కేసులు
- 18 లక్షలకు పైగా మరణాలు
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షల మందికి పైగా చనిపోయారు. మన దేశం విషయానికి వస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏడున్నర లక్షలను సమీపిస్తోంది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా కేసులపై అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ద్వారా పలు విషయాలు వెలుగుచూశాయి. 2021 మార్చి వరకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని తేలింది. 18 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతారని వెల్లడైంది. ఇదే సమయంలో ఇండియాలో ఊహించని విధంగా కేసులు నమోదవుతాయని... రోజుకు 2.8 లక్షల వరకు కేసులు వస్తాయని తేలింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.