ధారావిలో మూడు నెలల తర్వాత మళ్లీ వెలుగుచూసిన కేసు
- ఏప్రిల్ 5న చివరిసారి ఓ కేసు నమోదు
- ధారావిలో ఇంకా యాక్టివ్‌గా 352 కేసులు
- 2,335కు పెరిగిన కరోనా కేసులు
కరోనా వెలుగు చూసిన తొలి నాళ్లలో ముంబైలోని మురికివాడ ధారావిని భయపెట్టిన కరోనా.. అధికారుల కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఆ తర్వాత మాయమైంది. అయితే, గత మూడు నెలలుగా ప్రశాంతంగా ఉన్న ధారావిలో తాజాగా ఓ కొత్త కేసు నమోదైంది. మూడు నెలల తర్వాత నిన్న ఒకే ఒక్క కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ చివరిసారిగా ఏప్రిల్ 5న ఒక కేసు వెలుగు చూడగా, తాజగా మరో కేసు బయటపడింది. దీంతో ఇక్కడ నమోదైన మొత్తం కేసు సంఖ్య 2,335కు పెరిగింది. అయితే, మరణాల సంఖ్యను మాత్రం బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించలేదు.
ప్రస్తుతం ఇక్కడ 352 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ముంబైలో తొలి కరోనా కేసు నమోదైన 20 రోజుల తర్వాత ఏప్రిల్ 1న ధారావిలో తొలి కేసు నమోదు కాగా, ఆ తర్వాత వరుసపెట్టి కేసులు నమోదయ్యాయి. కాగా, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి 2.5 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇక్కడ 6.5 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు.