సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య హత్యకేసులో అత్త, ఆడపడుచుల అరెస్ట్

  • గత నెల 25న ఆత్మహత్య చేసుకున్న లావణ్య లహరి
  • అత్తమామలు, ఆడపడుచులే కారణమని ఫిర్యాదు
  • పరారీలో లావణ్య మామ
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య లహరి హత్యకేసులో పోలీసులు తాజాగా ఆమె అత్త, ఆడపడుచులను అరెస్ట్ చేశారు. పైలట్ అయిన భర్తతో కలిసి లావణ్య హైదరాబాద్, శంషాబాద్‌లో ఉండేవారు. వెంకటేశ్వరరావు చెడు తిరుగుళ్లకు అలవాటు పడడంతోపాటు భార్యను మానసికంగా హింసించేవాడు. అతడి వేధింపులు రోజురోజుకు శ్రుతిమించుతుండడంతో భరించలేని లావణ్య గత నెల 25న సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త వెంకటేశ్వరరావుతోపాటు అత్తమామలు, ఆడపడుచు, మరో బంధువే కారణమంటూ లావణ్య బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకి, వరిమడుగు గ్రామాల్లో తలదాచుకున్న అత్త రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారి, మరో వ్యక్తిని అరెస్ట్ చేయగా, వెంకటేశ్వరరావు తండ్రి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. నిందితులను నిన్న హైదరాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టు ఆదేశాలతో వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన లావణ్య భర్త వెంకటేశ్వరరావు రిమాండ్‌లో ఉన్నాడు.


More Telugu News