వచ్చే నెలలో చివరి సెమిస్టర్ పరీక్షలు.. కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

  • పరీక్షలు నిర్వహించొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను రేపు విచారించనున్న హైకోర్టు
  • పరీక్షలు నిర్వహిస్తామని చెప్పనున్న ప్రభుత్వం
  • కసరత్తు ప్రారంభించిన ఉన్నత విద్యామండలి
డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించరాదంటూ దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు రేపు విచారించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పరీక్షలపై తన వైఖరిని స్పష్టం చేయనుంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్టు కోర్టుకు తెలియజేయనుంది.

పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి నిన్న చర్చించారు. పరీక్షల నిర్వహణకు ముందు విద్యార్థులకు కనీసం రెండుమూడు వారాల సమయం ఇవ్వాలని, కాబట్టి ఆగస్టులోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది.


More Telugu News