నాలో... నాతో... వైఎస్సార్!... భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ
- రేపు వైఎస్సార్ జయంతి
- ఇడుపులపాయలో పుస్తకం ఆవిష్కరించనున్న సీఎం జగన్
- వైఎస్ అభిమానులకు పుస్తకం అంకితం
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అర్ధాంగి వైఎస్ విజయమ్మ భర్తపై పుస్తకం రాశారు. పుస్తకం పేరు 'నాలో... నాతో... వైఎస్సార్'. రేపు వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకం ఎమ్మెస్కో పబ్లికేషన్స్ ద్వారా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యమవుతుంది. ఒక తండ్రిగా, భర్తగా తనకు తెలిసిన వైఎస్సార్ ను ఆవిష్కరించడమే కాకుండా, ప్రజల నుంచి ఆయన గురించి తెలుసుకున్న సమాచారం కూడా ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వైఎస్ విజయమ్మ ముందుమాటలో వివరించారు.
వైఎస్సార్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ తన పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. తెలుగువాళ్లంతా తన కుటుంబమే అని భావించిన ఆ మహానేత గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకుని స్ఫూర్తి పొందాలన్న ఉద్దేశంతో 'నాలో.. నాతో... వైఎస్సార్' పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్టు వివరించారు.
ఈ పుస్తకంలో తమ వైవాహిక జీవితం, పేదల కోసం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైద్యం చేయడం, రాజకీయ రంగప్రవేశం, తమ పిల్లలు, దేవుడి పట్ల వైఎస్సార్ భక్తి, మరణానంతరం ఎదురైన సమస్యలు, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జరిగిన అన్ని ఘట్టాలను ప్రస్తావించారు.