సినిమా షూటింగులు పుంజుకునేలా ప్రోత్సాహకాలు... కేంద్రం యోచన
- త్వరలోనే విధివిధానాలు
- వినోద రంగంలో ఉత్పాదకత పెంపుపై ప్రత్యేక దృష్టి
- విదేశీ నిర్మాతలకు అనుమతి ఇచ్చామన్న జవదేకర్
కరోనా భూతం ప్రభావంతో దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలు కుదేలయ్యాయి. థియేటర్లు మూతపడడంతో భారీ చిత్రాలు సైతం ఓటీటీ వేదికలపై రిలీజవుతున్న పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల సినిమా, టీవీ షూటింగులు మొదలైనా యూనిట్ సభ్యులకు కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ ఏ చిత్ర పరిశ్రమలోనూ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కాలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో సినిమా షూటింగుల కోసం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్ఓపీ) రూపొందిస్తున్నామని చెప్పారు.
వినోద రంగం పూర్వ వైభవం పుంజుకునేలా ఫిలిం మేకింగ్, టీవీ సీరియళ్లు, కో-ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ ఇలా అనేక రంగాల్లో ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని, ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచడమే తమ లక్ష్యమని వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. కాగా, భారత్ లో చిత్రీకరణల కోసం ఇప్పటికే 80 మందికి పైగా విదేశీ నిర్మాతలు అనుమతులు పొందారని, వాళ్లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చామని వివరించారు.