కేసీఆర్ క్వారంటైన్ లో ఉన్నారు: జీవన్ రెడ్డి
- కరోనా విజృంభిస్తున్నా కేసీఆర్ అందుబాటులో లేరు
- వాస్తు పిచ్చితో పాలన చేస్తున్నారు
- సెక్రటేరియట్ పైనే ఆయన దృష్టి సారించారు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోందని... అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో లేరని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్వారంటైన్ లో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో... కరోనాపై గవర్నర్ నిన్న సమీక్ష నిర్వహించాలనుకున్నారని... అయితే, చీఫ్ సెక్రటరీ సహా అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదని విమర్శించారు.
ప్రజలంతా కరోనా గురించి భయాందోళనలకు గురవుతుంటే... కేసీఆర్ మాత్రం సెక్రటేరియట్ పై దృష్టి సారించారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తు పిచ్చితో పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. కొత్త సచివాలయం కావాలంటే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర కట్టుకోవచ్చని... ఉన్న బిల్డింగ్ ను కూల్చడమెందుకని ప్రశ్నించారు. సచివాలయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో
విచారణ ఉందని... అందుకే ఆగమేఘాలపై ఈ రోజే సచివాలయాన్ని కూల్చేస్తున్నారని అన్నారు.