ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి 200 మంది ఉద్యోగులను, వారి కుటుంబీకులను తరలించిన ఇన్ఫోసిస్!
- కరోనా నేపథ్యంలో ఉద్యోగులను తరలించిన ఇన్ఫోసిస్
- బెంగళూరుకు చేరుకున్న ఉద్యోగులు, వారి కుటుంబీకులు
- ఇండియాకు చేరుకున్న వారిలో ముగిసిన కొందరి వీసా గడువు
తమ సంస్థలో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులను, వారి కుటుంబీకులను ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అమెరికా నుంచి ఇండియాకు పంపించింది. కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో... వారి ఆరోగ్య సంరక్షణార్థం ప్రత్యేక చార్టర్డ్ విమానంలో తరలించింది. ఈ విమానం బెంగళూరుకు చేరుకుంది. వీరంతా బెంగళూరు లేదా దేశంలోని ఇతర లొకేషన్ల నుంచి పని చేయనున్నారు.
ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ బోడె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... అమెరికాలో పని చేస్తున్న తమ ఉద్యోగుల్లో కొందరి వీసా గడువు ముగిసిందని... అయితే, కరోనా కారణంగా విమానాలు లేకపోవడంతో, వారంతా అక్కడే చిక్కుకుపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ తొలి విమానాన్ని బుక్ చేసి, 200లకు పైగా ఉద్యోగులను, వారి కుటుంబీకులను ఇండియాకు తరలించిందని తెలిపారు. వారంతా బెంగళూరుకు క్షేమంగా చేరుకున్నారని చెప్పారు. ఉద్యోగుల సంరక్షణకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు.