ఇలాగే పెరుగుతూ పొతే.. కరోనా కేసుల్లో మనం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం: శివసేన
- ఈ యుద్ధం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కంటే క్లిష్టమైనది
- మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది
- కరోనాతో యుద్ధం 100 రోజులు దాటి పోయింది
- అత్యధిక కరోనా కేసుల్లో ఇప్పటికే రష్యాను దాటేశాం
దేశం నుంచి కరోనా 21 రోజుల్లో మాయం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదట్లో చెప్పారని, ఇప్పటికీ ఉద్ధృతి మరింత పెరుగుతూనే ఉందని శివసేన విమర్శలు కురిపించింది. 'కరోనాపై జరుగుతోన్న ఈ యుద్ధం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కంటే క్లిష్టమైన యుద్ధం. మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది. మార్చిలో మోదీ కరోనా గురించి మాట్లాడుతూ.. 21 రోజుల్లో దీనిపై విజయం సాధిస్తామని చెప్పారు. 100 రోజులు దాటి పోయింది.. కరోనా ఇప్పటికీ పెరిగిపోతూనే ఉంది. దీనిపై పోరాడుతున్న వారు అలసిపోతున్నారు' అని తన పత్రిక సామ్నాలోని ఓ కథనంలో పేర్కొంది.
'ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని కలలు కంటోన్న భారత దేశంలో ప్రతిరోజు కరోనా కేసులు దాదాపు 25,000 నమోదు అవుతుండడం దురదృష్టకరం. అత్యధిక కరోనా కేసుల్లో మనం ఇప్పటికే రష్యాను కూడా దాటేశాం. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే ఈ జాబితాలో మనం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటాం. 2021లోపు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మనం ఈ వైరస్‌తోనే సహజీవనం చేయాల్సి ఉంది' అని శివసేన చెప్పింది.