మీ స్మార్ట్ ఫోన్ లోని 'ఆరోగ్య సేతు' యాప్ ను డిలీట్ చేయాలంటే..!

  • కరోనా సమాచారాన్ని అందించే ఆరోగ్య సేతు
  • డిలీట్ ఆప్షన్ ను ప్రవేశపెట్టిన కేంద్రం
  • యాప్ డిలీట్ తరువాత 30 రోజులకు సమాచారం డిలీట్
కరోనా గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్ ను ఒకసారి ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత, దాన్ని డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. యాప్ లోని వినియోగదారుని డేటాను కూడా డిలీట్ చేసేందుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, స్మార్ట్ ఫోన్ లోని యాప్ ను డిలీట్ చేసిన 30 రోజుల తరువాత మాత్రమే డేటా తొలగిపోతుంది.

ఈ యాప్ ను వాడుతూ, జీపీఎస్, బ్లూటూత్ సౌకర్యాల ద్వారా ప్రమాద స్థాయిని అంచనా వేయడం, హెల్త్ డేటా సమీక్షలతో పాటు వినియోగదారు హెల్త్ డేటాను ఇతర హెల్త్ యాప్ లతో షేర్ చేసుకునే అప్ డేట్ కూడా వచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇక యాప్ ను ఎలా డిలీట్ చేయాలన్న విధానాన్ని పరిశీలిస్తే, 

యాప్ లో ఎడమవైపున్న యూజర్ ఐకాన్ నుంచి సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే, డిలీట్ మై ఎకౌంట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే, ఖాతా డిలీట్ అయిన తరువాత ఏం జరుగుతుందన్న విషయం కనపడుతుంది. దాన్ని ఓకే చేసిన తరువాత మీ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయడంతో పని పూర్తవుతుంది. యాప్ లో మీ ఖాతా మొత్తం డిలీట్ అవుతుంది.


More Telugu News