చైనా డ్రోన్లకు దీటైన అమెరికా డ్రోన్లపై భారత్ ఆసక్తి

  • పాక్ కు డ్రోన్లు ఇస్తున్న చైనా
  • భారత్ ను ఆకర్షిస్తున్న అమెరికా తయారీ ప్రిడేటర్-బి డ్రోన్లు
  • ఈ డ్రోన్లకు ఆయుధాలను ప్రయోగించగల సత్తా
పాకిస్థాన్, చైనా మధ్య అనేక ఆయుధ ఒప్పందాలు ఉన్నాయి. గతంలో అమెరికా నుంచి ఎక్కువ ఆయుధాలు పొందిన పాక్... ఇప్పుడు చైనా నుంచి ఆయుధ వ్యవస్థలు సమకూర్చుకుంటోంది. చైనా రూపొందించిన వింగ్ లూంగ్-2 పాక్ కొనుగోలు చేసింది. వీటిని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది. అప్పుడప్పుడు భారత సరిహద్దుల్లో కలకలం సృష్టించే దొంగ డ్రోన్లు ఇవే! అయితే ఇలాంటి డ్రోన్లకు దీటైన డ్రోన్లను సమకూర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అమెరికా తయారుచేస్తున్న ప్రిడేటర్-బి డ్రోన్లు భారత సాయుధ బలగాలను బాగా ఆకర్షిస్తున్నాయి.

ప్రిడేటర్-బి డ్రోన్లు నిఘా అవసరాల కోసమే కాదు, అవసరమైతే దాడులు కూడా చేయగలవు. వీటికి మిస్సైళ్లు, లేజర్ గైడెడ్ బాంబులు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంతేకాదు, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా యుద్ధ రంగాల్లో సమర్థంగా పనిచేసిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా మనవాళ్ల కొనుగోలు జాబితాలో ఉన్నాయి. ఇవి కూడా సాయుధ డ్రోన్లే. ఇటీవలి కాలంలో ఇటు పాకిస్థాన్ తోనూ, అటు చైనాతో సరిహద్దుల్లో భారత్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు కొత్తగా ఉద్రిక్తతలు ఏర్పడుతుండడంతో భారత్ అధునాతన రక్షణ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది.


More Telugu News