అమెరికాకే కాదు మిగతా ప్రపంచానికి కూడా చైనా తీవ్ర నష్టం కలిగించింది: ట్రంప్

  • ఇటీవల చైనాపై విరుచుకుపడుతున్న ట్రంప్
  • సందర్భం వచ్చినప్పుడల్లా చైనాపై విమర్శలు
  • చైనా వైరస్ అంటూ వ్యాఖ్యలు
తాను అమెరికా అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి చైనా అంటే కారాలు మిరియాలు నూరుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ అదే ధోరణి అవలంబిస్తున్నారు. మొదట వాణిజ్య ఒప్పందాల్లో విభేదాలు, ఆ తర్వాత కరోనా వైరస్ ట్రంప్ ను అట్టుడికిస్తున్నాయి. దాంతో వీలు చిక్కినప్పుడల్లా చైనాపై తీవ్ర విమర్శలు చేయడం ట్రంప్ కి పరిపాటి అయింది.

తాజాగా చేసిన ట్వీట్ అలాంటిదే. అమెరికాకు మాత్రమే కాదు, తక్కిన ప్రపంచానికి కూడా చైనా గొప్ప నష్టం కలిగించింది అని పేర్కొన్నారు. అంతకుముందు మరో ట్వీట్ లో చైనా వైరస్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా వైరస్ కారణంగానే కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా వస్తోందని వివరించారు.


More Telugu News