కరోనా లేకుంటే ఇప్పుడు ఉద్యమం జరిగేది: అశోక్ బాబు
- టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్లు నిర్మించినట్టు వెల్లడి
- ఆ ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్
- ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇబ్బందేంటని ఆగ్రహం
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో నిర్మించిన 6 లక్షల ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాపిస్తోందన్న కారణంతో తాము వెనక్కి తగ్గాము కానీ, లేకుంటే ఇప్పుడు ఉద్యమం చేసేవాళ్లమని స్పష్టం చేశారు.
టీడీపీ హయాంలో నిర్మితమైన ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటి? అంటూ ప్రశ్నించారు. 15 నెలల కిందటే నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను ఇప్పటివరకు నిరుపయోగంగా ఉంచడం సరికాదని అన్నారు. అంతేగాకుండా, పల్నాడు అంశంలోనూ ఆయన స్పందించారు. పల్నాడు పోలీసులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని కోరారు. ఆత్మకూరు, పిన్నెల్లి గ్రామాల్లో ఇప్పటికీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉందని ఆరోపించారు.