గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది: 32 దేశాల పరిశోధకులు
- ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి
- ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపిన పరిశోధకులు
- సిఫార్సులను సవరించాలని విజ్ఞప్తి
- 239 మంది పరిశోధకుల లేఖ
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని వందలాది పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు తెలిపారు.
ఈ మేరకు కరోనా వ్యాప్తిపై సిఫార్సులను సవరించాలని వారు కోరారు. తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌వోకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాశారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి దగ్గు, తుమ్ములు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపరల నుంచి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే చెప్పింది.
గాలి ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ప్రకటన చేయలేదు. ఈ పరిశోధనల వివరాలను పరిశోధకులు కొన్ని రోజుల్లో సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించనున్నారు. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపరల పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కొత్తగా గుర్తించారు. అయితే, కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్న విషయానికి సంబంధించిన ఆధారాలు సరిగాలేవని డబ్ల్యూహెచ్‌వో అంటోంది.