కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు: గ్రాఫ్ పోస్ట్ చేసిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని సాధించాం
- కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది
- సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం
- కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకొచ్చాం
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక పరీక్షలు చేస్తూ రికార్డు సృష్టించామని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 'రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే సాధించి ఏపీ రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చేసిన కరోనా పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది' అని ఆయన పేర్కొన్నారు.
'సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుని ఏపీ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకొచ్చింది. త్వరలోనే కరోనాను జయిస్తాం.. అందరూ ఇళ్లలోనే, సురక్షితంగా ఉండాలి' అని మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. కాగా, ఏపీలో మొదటి నుంచి అత్యధిక పరీక్షలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,697గా ఉంది.