పాక్‌కు శక్తిమంతమైన డ్రోన్లను పంపుతున్న చైనా
- గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చర్యలు
- పాక్‌లోని తమ నిర్మాణాల భద్రత కోసమేనంటోన్న చైనా
- సరిహద్దుకు సమీపంలో ఇప్పటికే వింగ్ లూంగ్-2 ఆర్మ్‌డ్ డ్రోన్లు
- ఒక్కో డ్రోన్‌లో లక్ష్యాలను ఛేదించే 12 మిసైళ్లు
తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా తన చర్యలను కొనసాగిస్తోంది. తన మిత్ర దేశం పాక్‌కు చైనా 2 ఆర్మ్‌డ్ డ్రోన్లను పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. పాకిస్థాన్‌లో తాము చేపట్టిన నిర్మాణాల భద్రత కోసమే వీటిని తరలిస్తున్నామని చైనా అంటోంది.
కానీ, గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే చైనా ఈ డ్రోన్లను పాక్‌కు సరఫరా చేయడం చర్చనీయాంశమైంది. సరిహద్దుకు సమీపంలో చైనా ఇప్పటికే వింగ్ లూంగ్-2 ఆర్మ్‌డ్ డ్రోన్లను వాడుతోంది. పాక్‌కు ఇప్పుడు ఆ డ్రోన్లనే సరఫరా చేస్తోంది. ఆ డ్రోన్లలో గాల్లో నుంచి ఉపరితలాల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించే 12 మిసైళ్ల చొప్పున ఉంటాయి.
భారత సరిహద్దుల వద్ద చైనా తీరుపై అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. దీంతో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. మరోపక్క, చైనాకు దీటుగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. సరిహద్దుల వద్ద నిఘాను మరింత శక్తిమంతం చేయడమే కాకుండా, ఒకవేళ చైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే క్షిపణులతో దాడి చేసేందుకు అమెరికాకు చెందిన ఆల్టిట్యూడ్ లాంగ్- ఎండ్యూరెన్స్ ఆర్మ్‌డ్ ప్రెడేటర్ బీ- డ్రోన్ల వినియోగంపై అమెరికాతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది.