కువైట్‌లోని 8 లక్షల మంది భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి!

  • ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును రూపొందించిన కువైట్
  • కువైట్‌లో 14.50 లక్షల మంది భారతీయులు
  • బిల్లు రాజ్యాంగ బద్ధమేనన్న ప్రభుత్వం
కువైట్‌లో నివసిస్తున్న భారతీయుల్లో 8 లక్షల మంది మెడపై కత్తి వేలాడుతోంది. కువైట్ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు కనుక ఆమోదం పొందితే వీరంతా బలవంతంగా స్వదేశం రావాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా బిల్లు రాజ్యాంగ బద్ధమేనని పేర్కొన్న కువైట్‌ జాతీయ అసెంబ్లీలోని లీగల్, లెజిస్లేటివ్ కమిటీ.. సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు మరో కమిటీకి బిల్లును అప్పగించింది.

ఈ బిల్లు ప్రకారం.. కువైట్‌ జనాభాలో భారతీయులు 15 శాతానికి మించకూడదు. ప్రస్తుతం కువైట్‌లో 14.50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు ప్రకారం 8 లక్షల మంది అధికంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి బిల్లు కనుక ఆమోదం పొందితే వీరంతా వెనక్కి రావాల్సి ఉంటుంది. కాగా, 43 లక్షల మంది ఉన్న జనాభా వున్న ఆ దేశంలో, మరో 30 లక్షల మంది వలసదారులు వుండడం గమనార్హం.


More Telugu News