కరోనా కేసుల్లో టాప్-3 స్థానానికి ఎగబాకిన ఇండియా!
- రష్యాలో 6.8 లక్షల కేసులు
- నిన్నటితో ఇండియాలో 6.9 లక్షల కేసులు
- ఇండియాకన్నా ముందు యూఎస్, బ్రెజిల్
కరోనా కేసుల విషయంలో భారతదేశం రష్యాను అధిగమించి, టాప్-3 స్థానంలోకి చేరుకుంది. నిన్న సాయంత్రానికి దేశంలో అధికారికంగా 6.9 లక్షల కేసులు రాగా, రష్యాలో నమోదైన 6.8 లక్షల కేసులను ఇండియా దాటేసింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు 28 లక్షలకు పైగా కేసులతో అమెరికా, 15 లక్షలకు పైగా కేసులతో బ్రెజిల్ ఉన్నాయి.
గడచిన 24 గంటల వ్యవధిలో 25 వేలకు పైగా కేసులు, 613 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జనవరిలో తొలి కేసు నమోదైన తరువాత, ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 19,268 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ, దక్షిణ భారతావనిలో రుతుపవనాలు విస్తరించి, వర్షాలు కురుస్తూ ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా.