ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

  • శబరి వంటి ఉప నదుల్లోకి భారీగా చేరుతున్న నీరు
  • దేవీపట్నం, కొండమొదలు ప్రాంతాల గ్రామాల్లో పెరుగుతున్న నీటిమట్టం
  • 10వ తేదీ నాటికి భద్రాచలం వద్ద 35 అడుగులకు చేరే అవకాశం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.  వర్షాల కారణంగా శబరి వంటి ఉప నదుల్లోకి నీరు చేరడంతో గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని దేవీపట్నం, కొండమొదలు పరిసర ప్రాంతాలైన నడిపూడి తెలిపేరు, కచ్చులూరు తదితర గ్రామాల్లో గత రెండు రోజులుగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ నెల పదో తేదీ నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35 అడుగులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాలకు తెలియజేసినట్టు తెలిపారు.


More Telugu News