కాన్పూర్ కాల్పుల కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి... నరరూపరాక్షసుల్లా ప్రవర్తించిన వికాస్ దూబే గ్యాంగ్
- డీఎస్పీ తల నరికివేత, కాలివేళ్ల కోసివేత
- ఓ ఎస్సై శరీరంపై బుల్లెట్ల వర్షం
- పోలీసుల తల భాగాల్లో అత్యధిక బుల్లెట్లు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వికాస్ దూబే గ్యాంగ్ ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. క్రిమినల్స్ ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు చివరికి తామే బలైపోయారు. మృతి చెందిన వారిలో ఓ డీఎస్పీ కూడా ఉన్నారు. కాగా, పోలీసుల మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. డీఎస్పీ తలను గొడ్డలితో నరికినట్టు గుర్తించారు. కాలివేళ్లను కోసేయడమే కాకుండా, శరీరాన్ని ఖండాలుగా నరికారు.
ఓ ఎస్సై శరీరంలో తుపాకీలో ఉన్న బుల్లెట్లన్నీ దింపేశారు. మరో కానిస్టేబుల్ పైనా ఇదే రీతిలో బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసుల నుంచి లాక్కున్న ఏకే-47 తుపాకీతో ఈ కాల్పులు జరిపారని తేలింది. బుల్లెట్ గాయాలతో పడివున్న పోలీసులను అత్యంత సమీపం నుంచి దారుణంగా కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలన్నీ తల, భుజాలపైనే ఉన్నాయని పోస్టుమార్టం చేసిన డాక్టర్లు తెలిపారు. తల భాగంలోనే అత్యధిక సంఖ్యలో బుల్లెట్లు ఉండడం పట్ల డాక్టర్లు కూడా విస్మయానికి గురయ్యారు. దీనిపై కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ స్పందిస్తూ, ఈ తరహా చర్యలకు మావోయిస్టులు ఎక్కువగా పాల్పడుతుంటారని చెప్పారు.