ఓ వృద్ధుడి మృతికి కారకుడైన శ్రీలంక స్టార్ క్రికెటర్ అరెస్ట్

  • కొలంబో శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
  • సైకిల్ పై వెళుతున్న వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కుశాల్ మెండిస్
  • మెండిస్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్న పోలీసులు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడంటూ శ్రీలంక స్టార్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబో శివారు ప్రాంతం పనాదురాలో ఓ వృద్ధుడు (74) సైకిల్ పై వెళుతుండగా, కుశాల్ మెండిస్ తన కారుతో ఢీకొట్టాడు. దాంతో ఆ వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

ఈ వేకువజామున ఈ ఘటన జరిగింది. కుశాల్ మెండిస్ గత కొంతకాలంగా శ్రీలంక జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవలే శ్రీలంకలో లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో సాధన చేసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి కారకుడైనట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం మెండిస్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.


More Telugu News