మహారాష్ట్రలో 2 లక్షల మైలురాయిని దాటేసిన కరోనా కేసులు.. 24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు
- ఇప్పటి వరకు 8,671 మంది మృతి
- రాష్ట్రంలో ఇంకా 83,295 యాక్టివ్ కేసులు
- నిన్న ఒక్క రోజే 295 మంది బలి
మహారాష్ట్రలో కరోనా కేసులు అంతుపొంతు లేకుండా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 7,074 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మైలు రాయిని దాటేసి 2,00,064కు చేరుకుంది.
రాష్ట్రంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, తాజాగా 295 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 8,671కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 83,295 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది.