రెండుసార్లు కరోనా నెగటివ్.. అయినా కోవిడ్‌తో మరణించిన వైద్యుడు
- ఢిల్లీ మెయిడ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్
- చాతీలో నొప్పిగా ఉందని, శ్వాస తీసుకోలేకపోతున్నానని ఫిర్యాదు
- అంతలోనే మృతి
రెండుసార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినా ఓ వైద్యుడు అదే మహమ్మారికి బలయ్యాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెంటల్ సైన్సెస్(మెయిడ్స్)లోని ఓరల్ సర్జరీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ అభిషేక్ గత నెలలో హరియాణాలోని రోహ్ తక్ కు వెళ్లి వచ్చారు. దీంతో ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోగా కరోనా నెగటివ్ అని వచ్చింది. అయితే, గురువారం తనకు చాతీలో నొప్పిగా ఉందని, శ్వాస తీసుకోలేకపోతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు.
తనలో కనిపిస్తున్నవి కరోనా లక్షణాలేనని చనిపోవడానికి ముందు తనతో చెప్పారని డాక్టర్ అభిషేక్ సోదరుడు అమన్ తెలిపారు. తనకు కచ్చితంగా కరోనా సోకిందని చెప్పారని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ అభిషేక్ మృతిపై మెయిడ్స్ సీనియర్ వైద్యుడు ఒకరు మాట్లాడుతూ అభిషేక్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్టు చెప్పారు. ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని పేర్కొన్నారు.