హైదరాబాద్ లో మరో లాక్ డౌన్ లేనట్టే... ఓ అభిప్రాయానికి వచ్చేసిన ప్రభుత్వం!
- లాక్ డౌన్ తో మరోసారి ఆర్థిక పరిస్థితి కుదేలు
- లాక్ డౌన్ పెట్టినా కరోనాను అడ్డుకునే పరిస్థితి లేదు
- ముఖ్యమంత్రికి వెల్లడించిన వైద్యాధికారులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో విడత లాక్ డౌన్ ప్రకటిస్తారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో లాక్ డౌన్ తప్పదని గత వారం రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆలోచనను కేసీఆర్ సర్కారు విరమించుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల లాక్ డౌన్ తరువాత, ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. చిరు వ్యాపారులు కూడా కొద్దోగొప్పో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇంకో లాక్ డౌన్ ను ప్రకటిస్తే, వ్యాపారాలన్నీ తిరిగి కుదేలవుతాయని అధికారులు తమ అభిప్రాయాలను సీఎంకు వెల్లడించినట్టు సమాచారం.
కాగా, నగరంలో మరో లాక్ డౌన్ గురించి ఆలోచిస్తున్నామని, ఈ విషయంలో మంత్రివర్గంతో చర్చించి, మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ గత నెల ఆఖరి వారంలో ప్రకటించగా, అప్పటి నుంచి ప్రజలతో పాటు, వ్యాపారుల్లోనూ ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే, ఇది జరిగి వారం రోజులు దాటుతున్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. గత వారం రోజులుగా మళ్లీ లాక్ డౌన్ పెడితే, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయమై ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేశారు. ప్రజా ప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా మరోసారి నిబంధనలను కఠినం చేస్తేనే బాగుంటుందని కొందరు చెప్పగా, ఎంత కఠినంగా లాక్ డౌన్ ను విధించినా, వైరస్ ను అడ్డుకునే పరిస్థితి లేదని, మరోసారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేటువంటి నిర్ణయాలు వద్దని అత్యధికులు సూచించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభదశకు చేరుకుందని, ఇప్పుడు లాక్ డౌన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వైద్య నిపుణులు వెల్లడించడంతో, రోగుల సంఖ్య పెరిగినా, వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్, ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.
అయితే, సమీప భవిష్యత్తులో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నందున వైద్య సదుపాయాలను, బెడ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. కొన్ని రోజుల పాటు పరిస్థితులను అంచనా వేసి, ఆపై ఓ ప్రకటన చేద్దామని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి లాక్ డౌన్ విధించాలంటే, ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాలను సిద్ధం చేయాల్సివుంటుంది. ఇప్పటివరకూ పోలీసు శాఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలూ అందలేదు. దీంతో లాక్ డౌన్ ఉండే అవకాశాలు లేవని పలువురు ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.