రాకెట్‌కు గుడ్‌బై.. ఆటకు వీడ్కోలు చెప్పేసిన చైనా దిగ్గజ షట్లర్ లిన్ డాన్
- రెండు దశాబ్దాలపాటు బ్యాడ్మింటన్ ప్రియులను అలరించిన లిన్
- ఇకపై మొత్తం సమయాన్ని కుటుంబంతోనే గడుపుతానని ప్రకటన
- తనలో స్ఫూర్తి నింపారంటూ ప్రత్యర్థులకు ధన్యవాదాలు
చైనాకు చెందిన దిగ్గజ షట్లర్ లిన్ డాన్ బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ప్రపంచంలోనే అత్యత్తమ ఆటగాడిగా పేరు సంపాదించుకున్న లిన్ రెండు దశాబ్దాలపాటు రాకెట్‌తో పెనవేసుకున్న బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు నిన్న ప్రకటించాడు. నిజానికి టోక్యో ఒలింపిక్స్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాలని అనుకున్నా.. కరోనా మహమ్మారి కారణంగా ఆ క్రీడలు వాయిదా పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్లకు దగ్గరపడుతున్న తాను శారీరక సామర్థ్యం, గాయాల కారణంగా సహచర ఆటగాళ్లతో పోటీ పడలేకపోతున్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో లిన్ 19వ స్థానంలో ఉన్నాడు.
తనలో స్ఫూర్తి నింపిన తన ప్రత్యర్థులకు ధన్యవాదాలు చెప్పిన లిన్.. ఇకపై మిగిలిన సమయాన్ని తన కుటుంబంతో గడుపుతానని పేర్కొన్నాడు. లిన్ 2008, 2012 ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు కొల్లగొట్టగా, 2006, 2007, 2009, 2011, 2013లలో ప్రపంచ చాంపియన్‌షిప్స్ అందుకున్నాడు. 2004, 2006, 2007, 2009, 2012, 2016లలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.