తెలంగాణలో పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం

  • రేపటి నుంచి షురూ
  • జూలై నుంచి నవంబరు వరకు అమలు
  • 2.79 కోట్ల మందికి లబ్ది
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చింది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో అనేక కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇప్పటికీ పేదలు ఉపాధి దొరక్క అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై నుంచి నవంబరు వరకు పేదలకు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2.79 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఈ కార్యక్రమం రేపటి నుంచి షురూ అవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.


More Telugu News