రైతు కంట నీరు, మహిళ ఉసురు మిమ్ము నీడలా వెంటాడుతుంది: వర్ల రామయ్య
- అమరావతి రైతులను హింసించే ఆలోచనలకు స్వస్తి చెప్పండి
- రాజధాని మార్పు ఆలోచనను విరమించుకోండి
- మొండిగా ముందెకెళ్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 200 రోజులకు చేరుకుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.
'ముఖ్యమంత్రి గారూ! 200 రోజులుగా పోరాటం చేస్తున్న అమరావతి రైతులను ఇంకా హింసించే ఆలోచనకు స్వస్తి చెప్పండి. భేషజాలకు పోకుండా రాజధాని మార్పు ఆలోచన మానుకోవాలి. మొండిగా ముందుకు వెళ్తే చరిత్ర హీనులుగా మిగులుతారు. రైతు కంట నీరు, పేద వాని కడుపు మంట, మహిళ ఉసురు మిమ్ము నీడలా వెంటాడుతుంది' అంటూ వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు.