ఏపీలో 17,699కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. అనంతపురం జిల్లాలో భారీగా పెరుగుతున్న కేసులు

  • 24 గంటల్లో కొత్తగా 727 కేసుల నమోదు
  • ప్రాణాలను కోల్పోయిన 12 మంది
  • రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 9,473
ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 727 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 127 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో 118, తూర్పుగోదావరి జిల్లాలో 102 కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 24 గంటల్లో కరోనా వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కర్నూలులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖపట్టణంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.

మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,699కి చేరుకుంది. మృతుల సంఖ్య 218కి పెరిగింది. 9,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News