హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ 'సడక్ 2' పోస్టర్‌పై కేసు నమోదు
- ఇటీవల పోస్టర్ విడుదల
- ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు
- సెక్షన్ 120బీ, 295ఏ కింద నమోదు
- 20 ఏళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న మహేశ్ భట్
బాలీవుడ్ సినిమా 'సడక్-2' పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో కేసు నమోదయింది. ఆ సినిమా దర్శకుడు మహేశ్ భట్‌తో పాటు నిర్మాత ముఖేశ్ భట్, నటి ఆలియా భట్‌పై సెక్షన్ 120బీ, 295ఏ కింద సికందర్‌పూర్‌కు చెందిన ఆచార్యచంద్ర కిషోర్ అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేశారు.
1991 సంవత్సరంలో విడుదలైన 'సడక్' సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను తీస్తున్నారు. సుమారు 20 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వం వహిస్తూ కూతురు ఆలియాతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పూజా భట్, సంజయ్ దత్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ను మూడు రోజుల క్రితం విడుదల చేశారు.
కాగా, యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్యకు నెపోటిజమే కారణమంటూ ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తితో మహేశ్ భట్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూతురు ఆలియాతో మహేశ్ భట్ తీస్తోన్న ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.