8 మంది పోలీసులను చంపిన నా కొడుకును పోలీసులే చంపేయాలి: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తల్లి
- టీవీలో చూసి ఎన్‌కౌంటర్ విషయాన్ని తెలుసుకున్నా
- పట్టుకోగలిగే వీలున్నాసరే చంపేయండి
- అతడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం
ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న తన కుమారుడిని పోలీసులే మట్టుబెట్టాలని గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే తల్లి సరళాదేవి అన్నారు. పోలీసులు తన కుమారుడిని పట్టుకోగలిగే వీలున్నా.. ఆ పని చేయకుండా చంపేయాలని ఆమె కోరారు. పోలీసులను చంపి తమ కుటుంబానికి అపఖ్యాతి తీసుకొచ్చాడని అన్నారు. కాన్పూర్‌లో మొన్న రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాశ్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్‌పై సరళాదేవి స్పందించారు. ఎన్‌కౌంటర్ విషయాన్ని తాను టీవీలో చూసి తెలుసుకున్నట్టు చెప్పారు. అమాయక పోలీసులను చంపిన తన కుమారుడు చాలా చెడ్డపని చేశాడని, అతడు తొందరగా పోలీసులకు లొంగిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అతడు తనంతట తాను లొంగిపోకపోతే పోలీసులే అతడిని పట్టుకుంటారని, అయితే పట్టుకున్నాక ఎన్‌కౌంటర్ చేసి అతడిని చంపేయాలని సరళాదేవి పోలీసులను కోరారు.
రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే వికాశ్ నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు మంత్రి సంతోశ్ శుక్లాను కూడా హతమార్చాడని, వికాస్ వల్ల తమ కుటుంబానికి తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వికాశ్‌ను తాను కలవలేదని, ప్రస్తుతం చిన్న కొడుకుతో కలిసి లక్నోలో ఉంటున్నట్టు సరళాదేవి చెప్పారు.