కరోనా వైరస్ జన్యుక్రమంలో మార్పులు.. మరింత పెరిగిన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం
- సార్స్‌కోవ్-2లో మార్పులతో కొత్త రకం వైరస్
- ‘డీ614జీ’ని ఏప్రిల్ తొలి వారంలోనే గుర్తించిన శాస్త్రవేత్తలు
- వైరస్‌కు ఉన్న కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో మార్పు
కరోనా వైరస్‌కు సంబంధించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ జన్యుక్రమంలో మార్పుల కారణంగా మనుషుల్లో ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం వైరస్‌లో మరింత పెరిగినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్‌కు కారణమయ్యే సార్స్ కోవ్-2 వైరస్‌లో మార్పుల కారణంగా ‘డీ614జీ’ అనే కొత్త రకం వైరస్ పురుడు పోసుకుందని, దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణాలు మరింత అధికంగా ఉన్నట్టు పరీక్షల్లో తేలిందన్నారు.
నిజానికి దీనిని ఏప్రిల్ తొలి వారంలోనే గుర్తించినట్టు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్తరకం వైరస్ ప్రవేశిస్తే పరిస్థితి మొత్తం తారుమారు అవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన బెటో కోర్బర్ పేర్కొన్నారు. ఈ వైరస్‌లో మార్పు చిన్నదే అయినా అది చాలా సమర్థవంతమైనదని, వైరస్ పై పొరల్లో ఉండే కొమ్ములాంటి ‘స్పైక్ ప్రొటీన్’లో ఈ మార్పు జరిగినట్టు వివరించారు.