సరోజ్ ఖాన్ నా తొలి కొరియోగ్రాఫర్... ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: అల్లు అర్జున్

  • గుండెపోటుతో సరోజ్ ఖాన్ మృతి
  • శోకసంద్రంలా బాలీవుడ్
  • డాడీ సినిమాలో బన్నీతో స్టెప్పులేయించిన సరోజ్ ఖాన్
బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించారు. సరోజ్ ఖాన్ మృతితో బాలీవుడ్ మూగబోయింది. ఆమె అనేక ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా పనిచేయడంతో, ఆమెతో అనుబంధం ఉన్న వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా సరోజ్ ఖాన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సరోజ్ ఖాన్ తన తొలి కొరియోగ్రాఫర్ అని, ఆమె మరణించిందన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. అల్లు అర్జున్... అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో ఓ చిన్న డాన్స్ స్కిట్ చేశాడు. ఆ స్కిట్ కు స్టెప్పులు కంపోజ్ చేసింది సరోజ్ ఖాన్. కెమెరా ముందుకు రావడం అదే తొలిసారి అని, కానీ ఎంతో అనుభవం ఉన్న సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ ఆ సమయంలో అక్కడ ఉండడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఆమె వంటి ప్రతిభావంతురాలి స్థానాన్ని భర్తీ చేయడం వీలుకాదని అభిప్రాయపడ్డారు.


More Telugu News