కరోనా ఎఫెక్ట్: నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా
- ప్రవేశ పరీక్షలపై కరోనా ప్రభావం
- సెప్టెంబరు 1 నుంచి 6 మధ్య జేఈఈ మెయిన్
- సెప్టెంబరు 13న నీట్
కరోనా మహమ్మారి ప్రభావంతో వార్షిక పరీక్షలకే కాదు, పోటీ పరీక్షలు సైతం వెనక్కిపోతున్నాయి. తాజాగా, నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటన చేసింది. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. జేఈఈ మెయిన్ పరీక్ష సెప్టెంబరు 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో నిర్వహిస్తామని, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష సెప్టెంబరు 27న నిర్వహిస్తామని వివరించారు. జాతీయస్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ప్రవేశ పరీక్ష సెప్టెంబరు 13న జరుగుతుందని తెలిపారు.