'భానుమతి అండ్ రామకృష్ణ' చిత్రాన్ని 'ఆహా' యాప్ లో విడుదల చేసిన తలసాని
- కరోనా కారణంగా థియేటర్లు బంద్
- ఓటీటీ బాటపడుతున్న కొత్త సినిమాలు
- కరోనా వ్యాప్తితో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న తలసాని
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటీటీ వేదికలకు స్వర్ణయుగం నడుస్తోందని చెప్పాలి. బాలీవుడ్ లో పెద్ద సినిమాలు సైతం అమెజాన్, డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటీటీ వేదికలపై రిలీజ్ అవుతుండగా, తెలుగులో ఓ మోస్తరు చిత్రాలు కూడా అదే బాటపడుతున్నాయి. తాజాగా నవీన్ చంద్ర, సలోనీ లూత్రా జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'భానుమతి అండ్ రామకృష్ణ' చిత్రం 'ఆహా యాప్' ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ చిత్రాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 'ఆహా యాప్' లో విడుదల చేశారు. ఈ ఉదయం భానుమతి అండ్ రామకృష్ణ చిత్ర యూనిట్ సభ్యులు మంత్రి తలసాని నివాసానికి వెళ్లారు. ఓటీటీ వేదికపై ఈ సినిమాను రిలీజ్ చేసిన అనంతరం తలసాని మాట్లాడుతూ, ప్రస్తుతం సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితులు ఉన్నాయని, కరోనా వైరస్ వ్యాప్తితో సినీ పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 'భానుమతి అండ్ రామకృష్ణ' చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.