సలహా ఇచ్చినందుకు యూనిస్ ఖాన్ ఓసారి నా గొంతుపై చాకు పెట్టాడు: క్రికెట్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్
- 2016లో బ్రిస్బేన్‌లో ఓ టెస్టు సందర్భంగా ఘటన
- బ్యాంటింగ్ లో ఓ సలహా ఇచ్చాను
- పక్కన ఉన్న ఆర్థర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది
- అయినప్పటికీ దాన్ని కూడా ఆస్వాదించా
గతంలో ఓ సారి క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా తాను సలహాలు ఇచ్చినందుకు గాను పాక్ మాజీ క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ యూనిస్ ఖాన్ తన గొంతుపై చాకు పెట్టాడని పాక్ మాజీ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చెప్పారు. తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... యూనిస్ ఖాన్‌కు బ్యాటింగ్‌లో కోచింగ్ ఇవ్వడం చాలా కష్టతరంగా ఉండే విషయమని చెప్పారు.
2016లో బ్రిస్బేన్‌లో ఓ టెస్టు జరిగిన సందర్భంగా ఆయన తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనను గుర్తు చేస్తున్నానని అన్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న సమయంలో యూనిస్ ఖాన్‌కు తాను బ్యాటింగ్ విషయంపై ఓ సలహా ఇవ్వాలని ప్రయత్నించానని, అయితే, తన మాట వినేందుకు ఇష్టపడని యూనిస్ ఖాన్ ఆగ్రహంతో వెంటనే ఓ చాకు తీసి తన గొంతు మీద పెట్టాడని చెప్పారు.
ఆ సమయంలో తమ పక్కన హెడ్ కోచ్ ఆర్థర్ ఉన్నాడని, చాకు పెట్టగానే ఆయన కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఇది చాలా ఆసక్తికర ఘటన అని, ఆ సమయంలో కోచ్‌గా కొనసాగుతోన్న తనకు ఈ ఘటన నరకంగా అనిపించిందని, అయినప్పటికీ దాన్ని కూడా తాను ఆస్వాదించానని వివరించారు. యూనిస్ ఖాన్ పాక్ క్రికెటర్లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడని ఆయన చెప్పారు.