ఫోన్ లో సంభాషించుకున్న మోదీ, పుతిన్... భారత్-రష్యా సంబంధాల బలోపేతానికి నిర్ణయం!
- పుతిన్ కు మోదీ ఫోన్ కాల్
- కరోనా సంక్షోభంపై సమాలోచనలు
- మోదీకి ధన్యవాదాలు తెలిపిన రష్యా అధ్యక్షుడు
కరోనా మహమ్మారి ధాటికి ద్వైపాక్షిక చర్చలు కూడా ఫోన్లకే పరిమితం అవుతున్నాయి. తాజాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, సలహా సంప్రదింపులను ఇకపైనా కొనసాగించాలని నిర్ణయించారు. ముఖ్యంగా, కరోనా సంక్షోభం, నియంత్రణ చర్యలు, కరోనా రాకతో మారిన ప్రపంచ పరిస్థితులపైనా మోదీ, పుతిన్ సమాలోచనలు జరిపారు. ఈ ఏడాది చివర్లో భారత్ లో శిఖరాగ్ర సమావేశం నిర్వహణ దిశగా చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా తనకు ఫోన్ చేసిన ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య మైత్రిని, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోదీ చూపిస్తున్న శ్రద్ధను కొనియాడారు. ఇక, రెండో ప్రపంచ యుద్ధంలో సంకీర్ణ సేనల విజయాలను పురస్కరించుకుని 75వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల మోదీ రష్యా అధ్యక్షుడ్ని అభినందించారు.