ఏపీ ఉద్యోగుల జీతాలకు తొలగిన ఆటంకం.. బిల్లుకు గవర్నర్ ఆమోదం

  • శాసనమండలిలో క్లియర్ కాని ద్రవ్య వినిమయ బిల్లు
  • ముగిసిన 14 రోజుల గడువు
  • గవర్నర్ ఆమోదం కోసం ఈరోజు బిల్లును పంపిన ప్రభుత్వం
ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనమండలిలో ఆమోదముద్ర పడకపోవడంతో... ప్రభుత్వోద్యోగులకు జీతాలు పడని సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కాసేపటి క్రితం ఆమోదముద్ర వేశారు. దీంతో, ప్రభుత్వోద్యోగుల జీతాల చెల్లింపుకు, ఇతర బిల్లుల చెల్లింపులకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. శాసనమండలి సమావేశాలు ముగిసిన తర్వాత... 14 రోజుల గడువు ముగియడంతో బిల్లును ఈరోజు గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. ఆయన ఆమోదం తెలపడంతో... జీతాల సమస్య తీరిపోయింది.


More Telugu News