సినీ పరిశ్రమలో నెపోటిజంపై తమన్నా స్పందన
- మా ఇంట్లో అందరూ డాక్టర్లే
- సినీ పరిశ్రమతో సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చాను
- నా ప్రతిభను చూసే అవకాశాలు వచ్చాయి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత సినీ పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దీనిపై తన అభిప్రాయాలను వెల్లడించగా... తాజాగా నటి తమన్నా ఈ అంశంపై స్పందించింది.
తమ కుటుంబంలో అందరూ డాక్టర్లేనని... సినీ పరిశ్రమతో సంబంధంలేని కుటుంబం నుంచి తాను వచ్చానని తమన్నా చెప్పింది. ముంబై అమ్మాయినైన తాను తెలుగు, తమిళ సినిమాలను చేయడం ప్రారంభించినప్పుడు తనకు ఈ భాషలు కూడా తెలియవని అంది. సినీ పరిశ్రమలో తనకు ఎవరితో పరిచయం లేకపోయినా.. తనకు అవకాశాలు వచ్చాయని చెప్పింది.తన ప్రతిభ, నిబద్ధతను చూసి తనకు అవకాశాలను ఇచ్చారని తెలిపింది.
తన విజయాలకు, తన పరాజయాలకు తానే కారణమని చెప్పింది. బంధుప్రీతి, రాజకీయాలు అనేవి అన్ని రంగాల్లో ఉంటాయని... టాలెంట్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమని తెలిపింది. తన పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తామంటే తాను ఎంకరేజ్ చేస్తానని చెప్పింది.