ఏపీ అసెంబ్లీ, సచివాలయంలో కరోనా ఉద్ధృతి
- ఇటీవల అసెంబ్లీ, సచివాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు
- సచివాలయంలో 10 మందికి పాజిటివ్
- జలవనరుల శాఖలో ముగ్గురికి కరోనా
ఏపీ శాసనసభ, సచివాలయంలో కరోనా కల్లోలం రేగింది. ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అసెంబ్లీ, సచివాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను నేడు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు. సచివాలయంలో 10 మంది కరోనా అని వెల్లడి కాగా, జలవనరుల శాఖలో ముగ్గురు, పశు సంవర్ధకశాఖలో ఒకరు కరోనా బారినపడ్డారు. అసెంబ్లీ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో, తమ శాఖలో ఉద్యోగులను జలవనరుల శాఖ అధికారులు జూలై 14 వరకు ఇంటి వద్ద నుంచి పనిచేయాలని సూచించారు. కరోనా కేసులు వెల్లడి కావడంతో అసెంబ్లీ, సచివాలయ భవనాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.