విరసం నేత వరవరరావు పరిస్థితి విషమం... భార్యకు ఫోన్ ద్వారా తెలిపిన జైలు అధికారులు

  • భీమా కోరేగావ్ కేసులో జైల్లో ఉన్న వరవరరావు
  • ఇటీవలే వరవరరావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన
భీమా కోరేగావ్ కేసులో కీలక నిందితుడు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందంటూ ముంబై తలోజా జైలు అధికారులు ఆయన భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

కొన్నిరోజుల క్రితమే ఆరోగ్యం బాగా లేదంటూ బెయిల్ కోసం వరవరరావు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. భీమా కోరేగావ్ కుట్రలో వరవరరావు పాత్ర కీలకమని, ఆయనకు బెయిల్ ఇవ్వరాదని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. తాజాగా, వరవరరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఆయనకు ముంబై తలోజా జైల్లోనే చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు.


More Telugu News