చైనాపై డిజిటల్‌ స్ట్రయిక్‌ జరిపాం: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్

  • దేశ ప్రజల డేటాకు భద్రత కల్పించడానికి యాప్‌ల నిషేధం
  • భారత్ శాంతికాముక దేశం
  • మన దేశంపై ఎవరి కన్ను పడినా వారికి బుద్ధి చెబుతాం
చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించడం పట్ల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఈ రోజు ఆయన పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీని ఉద్దేశించి వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... 'దేశ ప్రజల డేటాకు భద్రత కల్పించడానికి చైనా యాప్‌లను నిషేధించాం. భారత్ శాంతికాముక దేశం. అయితే, మన దేశంపై ఎవరి కన్ను పడినా వారికి గట్టిగా బుద్ధి చెబుతాం' అని చెప్పారు.

గాల్వన్‌లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలకు ప్రతిగా తీసుకున్న ఈ చర్యను రవి శంకర్ ప్రసాద్ డిజిటల్ స్ట్రయిక్‌గా అభివర్ణించారు. చైనా యాప్‌లను నిషేధిస్తూ తీసుకున్న చర్యలను ఇటీవల కొన్ని మీడియా సంస్థలు కూడా డిజిటల్ స్ట్రయిక్‌గా పేర్కొన్న విషయం తెలిసిందే. పాక్‌లోని ఉగ్రమూకలపై గతంలో భారత్‌ సర్జికల్ స్ట్రయిక్స్‌ జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై తీసుకున్న చర్యలను డిజిటల్‌ స్ట్రయిక్‌గా పేర్కొంటున్నారు.


More Telugu News