గోల్డెన్ బాబా మృతి.. అంత్యక్రియలకు హాజరుకాని బంధువులు!
- కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న గోల్డెన్ బాబా
- ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూత
- తీవ్ర ఆవేదనలో బాబా భక్తులు
గోల్డెన్ బాబాగా పేరుగాంచిన సుధీర్ కుమార్ మక్కర్ తుదిశ్వాస విడిచారు. యూపీలోని ఘజియాబాద్ లో ఉంటున్న ఆయన... ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏడాది కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించి ఆయన మృతి చెందారు.
మరోవైపు గోల్డెన్ బాబా అంత్యక్రియలకు ఒకరిద్దరు మినహా ఆయన బంధువులు ఎవరూ హాజరుకాలేదు. కరోనా భయాలతో అంతిమ సంస్కారాలకు వారు రాలేదు. ఈ నేపథ్యంలో, వీడియో కాల్ ద్వారా ఆయన దహన సంస్కారాలను బంధువులకు చూపించారు. గోల్డెన్ బాబా మరణంతో ఆయన భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
కాగా, ఎప్పుడూ ఒంటినిండా పలు బంగారు ఆభరణాలు ధరిస్తూ కనిపించడం వల్ల ఆయనకు గోల్డెన్ బాబా అన్న పేరు వచ్చింది. ఈయనపై పలు క్రిమినల్ కేసులు కూడా పెండింగులో వున్నాయి.