విడాకుల కారణంగా సంపదను కోల్పోయినా... తన రికార్డును తానే బద్దలు కొట్టిన జెఫ్ బెజోస్!

  • రెండేళ్లనాడు మెకెంజీకి 40 బిలియన్ డాలర్లు
  • ఆ సంపదను తిరిగి సంపాదించుకున్న జెఫ్ బెజోస్
  • గణనీయంగా పెరిగిన అమెజాన్ ఈక్విటీ విలువ
అమెజాన్ వ్యవస్థాపక సీఈఓ జెఫ్ బెజోస్, తన భార్య మెకెంజీతో విడాకులు తీసుకున్న వేళ, ఆమెకు ఇచ్చిన నాలుగో వంతు ఆస్తిని తిరిగి సంపాదించుకున్నారు. గత సంవత్సరం మెకెంజీతో విడిపోతున్న వేళ, తన ఆస్తిలోని 25 శాతం మొత్తాన్ని ఆమెకు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఆస్తి విలువ దాదాపు 167  బిలియన్ డాలర్లు కాగా, ఇటీవలి కాలంలో అమెజాన్ ఈక్విటీ విలువ పెరుగుతూ రావడంతో, జెఫ్ బెజోస్ సంపద 172 బిలియన్ డాలర్లను తాకింది.

బుధవారం నాడు యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సంస్థ ఈక్విటీ విలువ 4.4 శాతం పెరిగి 2,879 డాలర్లకు చేరుకుంది. దీంతో బెజోస్ సంపద 171.6 బిలియన్ డాలర్లను తాకింది. మెకెంజీకి విడాకులు ఇచ్చే నాటికి, అంటే... సెప్టెంబర్ 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్లని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. విడాకుల తరువాత ఆయన ఆస్తిలో 40 బిలియన్ డాలర్లకు పైగా భార్యకు ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి రెండేళ్లలోపే ఆయన ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకున్నారు. దీంతో తన సంపద రికార్డును తానే బద్దలు కొట్టినట్లయింది.

ఇదే సమయంలో ఆయన భార్య మెకంజీ ప్రపంచంలోనే రెండవ సంపన్న మహిళగా నిలవడం గమనార్హం. విడాకుల తరువాత ఆమెకు అమెజాన్ లో 4 శాతం వాటాలు దక్కగా, దీని విలువ 56.9 బిలియన్ డాలర్లు. తొలి మహిళగా లోరియల్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ అత్యంత ధనవంతురాలైన మహిళగా ఉన్నారు.


More Telugu News