కేంద్రం నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే... భవంతి అద్దె చెల్లించిన ప్రియాంకా గాంధీ!
- రూ. 3.46 లక్షలు చెల్లించిన ప్రియాంకా
- ఆన్ లైన్ మాధ్యమంగా బకాయిల చెల్లింపు
- వెల్లడించిన ప్రభుత్వ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, తన ల్యూతెన్స్ బంగ్లాకు బకాయిపడ్డ అద్దెను చెల్లించారు. నిన్న ఆమె తక్షణం తాను ఉంటున్న 35, లోధీ ఎస్టేట్ ను ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులు అందుకున్న గంటల వ్యవధిలోనే ప్రియాంకా గాంధీ తన బకాయిలను చెల్లించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది.
"తన నివాసానికి కట్టాల్సిన అద్దె బకాయిలను ప్రియాంకా గాంధీ ఆన్ లైన్ పేమెంట్ విధానంలో చెల్లించారు. జూన్ 30 నాటికి ఆమె ఒక్క పైసా కూడా బకాయి లేరు" అని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆమె మొత్తం రూ. 3,46,677 చెల్లించారని వెల్లడించారు.
కాగా, ప్రియాంకా గాంధీ బకాయిలను చెల్లించినప్పటికీ, ఆమె నెల రోజుల వ్యవధిలో ఇంటిని ఖాళీ చేయాల్సిందేనని, ఆగస్టు 1 తరువాత ఆమె అదే ఇంట్లో ఉంటే, నిబంధనల ప్రకారం చర్యలుంటాయని పేర్కొన్నారు.